4న అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్ పై విచారణ
కలెక్టర్
ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటీషన్ పై
విచారణను సంగారెడ్డి అర్బన్ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మెదక్
జిల్లా సంగారెడ్డి న్యాయస్థానంలో అక్బరుద్దీన్ తరపు లాయర్ ఈ పిటిషన్ ను
వేశారు. దీనిపై విచారణను జిల్లా ఐదవ అదనపు న్యాయమూర్తి ఈ నెల 4కు వాయిదా
వేశారు. మరోవైపు అక్బరుద్దీన్ ను నేడు, రేపు నిజామాబాద్ పోలీసులు
విచారించనున్నారు. ఇందుకోసం ఆయనను పోలీసులు ఈ ఉదయమే అదిలాబాద్ జైలు నుంచి
నిజామాబాదుకు తరలించారు.