ఇక కంప్యూటర్లు మనలాగే ఆలోచిస్తాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక కంప్యూటర్లు మనలాగే ఆలోచిస్తాయి!

మానవ మేధస్సు రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ అభివృద్ధిలో భాగంగా ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు. తాజాగా మనిషిలాగా ఆలోచించగలిగే కంప్యూటర్‌ చిప్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఉన్న కంప్యూటర్‌ చిప్‌లు చాలా పనులను క్షణాల్లో పూర్తి చేయగలిగేలా ఉన్నా మనిషిలాగా ఆలోచించలేకపోతున్నాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇలాంటి చిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

బోయిస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎలీసా బర్నే స్మిత్‌, క్రిస్‌ క్యాంబెల్‌, విశాల్‌ సక్సేనా అనే శాస్త్రవేత్తలు మనిషి మెదడును పోలిన చిప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న కంప్యూటర్‌ చిప్‌లు పలు రకాలైన పనులను క్షణాల్లో పూర్తి చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగివున్నాయి. అయితే మనిషి మెదడులాగా ఆలోచించి పనిచేయలేకపోతున్నాయి. ఈ విషయంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కంప్యూటర్‌లాగా అత్యంత వేగంగా పనిచేయడమే కాకుండా మనిషిలాగా తెలియని విషయాలను నేర్చుకోవడం, అనుకరించడం, సందర్భానికి తగినట్టుగా స్పందించడం వంటి చర్యలను కూడా చేసే విధంగా కంప్యూటర్‌ చిప్‌ను రూపొందించారు. ఈ చిప్‌ను మెర్మిస్టర్‌ అనే రెసిస్టర్‌ ఆధారంగా రూపొందించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు.

More Telugu News