ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి..హర్మన్ ప్రీత్ సెంచరీ వృధా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి..హర్మన్ ప్రీత్ సెంచరీ వృధా

మహిళా ప్రపంచకప్ ముంబై వన్డేలో 32 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు, ఓపెనర్ ఎడ్వర్డ్స్ సెంచరీతో 272 పరుగులు చేసింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్లెన్ మిథాలీ రాజ్ (8), తొలి మ్యాచ్ లో సెంచరీ చేసిన ఓపెనర్ కామినీ (10), మరో ఓపెనర్ రౌత్(4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

ఒంటరి పోరాటం చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ ఉమన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ (109 బంతుల్లో 107 పరుగులు నాటౌట్) వృధా అయింది. హర్మీత్ కు చక్కని సహకారం అందించిన జైన్ (56) హఫ్ సెంచరీ చేసింది. చివర్లో రన్ రేట్ పెరగడంతో ఒత్తిడికి లోనైన భారత్ బ్యాట్స్ ఉమన్ వికెట్లు పారేసుకున్నారు. దీంతో భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 240 పరుగులే చేసింది. 

More Telugu News