Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నారుల శృంగార చిత్రాలను పంపిణీ చేస్తున్న భారతీయుడి అరెస్ట్

ఇంటర్నెట్ ద్వారా చిన్నారుల శృంగార చిత్రాలను పంపిణీ చేస్తున్న భారతీయుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు షార్జాలో సదరు నిందితుడి ఇంటిపై దాడి చేసి ఓ కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చిన్నారుల బూతు చిత్రాలు ఉండడంతోపాటు, అతడు 'పీర్ టు పీర్' సాఫ్ట్ వేర్ వాడుతున్నట్లుగా గుర్తించారు. దీని ద్వారా ఒకరితో మరొకరు చిత్రాలు, వీడియోలను పంపించుకోవచ్చు. నిందితుడు తన తప్పును అంగీకరించినట్లుగా పోలీసులను ఉదహరిస్తూ స్థానిక పత్రిక ఒకటి పేర్కొంది.

More Telugu News