Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సమైక్య' నిరసనలతో శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు వాయిదా

సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న నిరసనలతో.. శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల నిర్వహణ వాయిదా పడింది. ఈ ఉత్సవాలు ఈ నెల 25 నుంచి అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు అనంతపురం ఆర్డీవో ఈ రోజు ప్రకటించారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

More Telugu News