నోటి బ్యాక్టీరియాతో ఆ క్యాన్సరును గుర్తించొచ్చు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోటి బ్యాక్టీరియాతో ఆ క్యాన్సరును గుర్తించొచ్చు

నోటిలోను, పేగుల్లోను కనిపించే ఒక రకమైన బ్యాక్టీరియాతో మలద్వార క్యాన్సరుకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నోటిలో సహజంగా కనిపించే ఒకరకమైన బ్యాక్టీరియా మలద్వార క్యాన్సరును వృద్ధిచేసే జన్యువులను ఉత్తేజితం చేస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. ఫలితంగా మలద్వార క్యాన్సరుకు దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సహజంగా నోటిలో కనిపించే పేగుల్లోని బ్యాక్టీరియా విపరీతమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించి, క్యాన్సరును వృద్ధిచేసే జన్యువులను ఉత్తేజితం చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మలద్వార క్యాన్సరుకు దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నోట్లోను, పేగుల్లోను ఉండే పూసో బ్యాక్టీరియాకు మలద్వార క్యాన్సరుకు సంబంధం ఉన్నట్టు ఇటీవలే బయటపడింది. అయితే క్యాన్సరు కణితులు ఏర్పడడానికి కచ్చితంగా ఈ బ్యాక్టీరియానే కారణం అవుతుందో లేదో అనే విషయంగానీ, ఒకవేళ కారణమైతే ఎలా జరుగుతుందనే విషయంగానీ స్పష్టంగా వెల్లడికాలేదు. తాజాగా సెల్‌ హోస్ట్‌ అండ్‌ మైక్రోబ్స్‌ పత్రికలో ప్రచురితమైన రెండు అధ్యయనాలు ఈ విషయాలను గురించి విపులీకరించాయి. మన నోటిలోను, పేగుల్లోను కనిపించే బ్యాక్టీరియా మలద్వారా క్యాన్సరుకు దోహదం చేస్తున్నట్టు ఈ అధ్యయనాలు విశ్లేషించాయి. ఈ విశ్లేషణలు తొలిదశలోనే మలద్వారా క్యాన్సరు వ్యాధిని గుర్తించడానికి, దీన్ని నివారించడానికి అవసరమైన చికిత్సకు కూడా తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు.

More Telugu News