ప్రజలే నాయకులుగా సాగుతున్న ఉద్యమం ఇది: ఏపీఎన్జీవో
ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నాయకుల అవసరం లేకుండానే సాగుతోందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజలు నాయకులకే నాయకత్వ లక్షణాలు నేర్పుతారని అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అందరూ నాయకులే అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె జరుగుతోండగా.. రేపు ఏపీఎన్జీవో భేటీ ఉంటుందని, దాంట్లో ఉద్యమం తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.