జలాంతర్గామిలో రెండు పేలుళ్లు
సింధు రక్షక్ జలాంతర్గామిలో రెండు పేలుళ్లు జరిగాయని నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషి తెలిపారు. ముంబైలో సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రమాదంలో జలాంతర్గామి పూర్తిగా మునిగిపోయిందని అన్నారు. జలాంతర్గామి లోపల పేలుడు వల్లే ప్రమాదం సంభవించిదని తెలిపారు. కాగా, జరిగిన ప్రమాదంపై రక్షణ శాఖ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే నౌకాదళం దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాదం పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతుందని జోషి స్పష్టం చేశారు. జలాంతర్గామిలో చిక్కుకున్న నావికుల్ని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.