లోక్ సభ సోమవారానికి వాయిదా
లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించిన అనంతరం సభను ఈనెల 19 వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అంతకుముందు ఆహారభద్రత బిల్లుపై చర్చ జరిగినా సీమాంధ్ర ఎంపీల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగలేదు. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడింది.