ఏపీఎన్జీవోలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు విఫలం
ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించబోమని, కేవలం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటామని ఏపీఎన్జీవోలు అంగీకరించారు. ఆగస్టు 15న కూడా తమ నిరసనలు కొనసాగిస్తామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అయితే, సమ్మె యథాతధంగా జరుగుతుందని, భవిష్యత్ కార్యాచరణను 16వ తేదీన గుంటూరులో ప్రకటిస్తామన్నారు.