తుపాకీతో సంచరిస్తున్న ముగ్గురు అరెస్టు
లైసెన్స్ లేని తుపాకీతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను విజయవాడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఆరు రౌండ్ల తూటాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.