పీవీ సింధుకు అర్జున అవార్డు
తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు అర్జున అవార్డుకు ఎంపికైంది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ వేదికలపై విశేషంగా రాణిస్తున్న సింధు, తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ వరల్డ్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా సింధు రికార్డు పుటల్లోకెక్కింది.