కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకం : గాదె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకం : గాదె

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యధిక ప్రజల అభీష్టాన్ని గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో సీమాంధ్ర జిల్లాలు, హైదరాబాద్ ను మినహాయిస్తే కేవలం రెండున్నర కోట్లమంది ప్రజలే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేశారని గుర్తించాలని తెలిపారు. అత్యధిక ప్రజల అభీష్టాన్ని విస్మరించి ఏ ప్రాతిపదికన విభజన నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకుంటే వ్యతిరేకించేవారు లేరని స్పష్టం చేశారు.

More Telugu News