పార్లమెంటుకు చేరిన సోనియా అల్లుడి భూభాగోతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్లమెంటుకు చేరిన సోనియా అల్లుడి భూభాగోతం

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్టా వాద్రా భూ వ్యవహారంపై బీజేపీ పార్లమెంటులో ధ్వజమెత్తింది. వాద్రా హర్యానాలో కొన్న 3.5 ఎకరాల భూమి విషయంలో తప్పుడు పత్రాలు చూపారంటూ కొంత కాలంగా వస్తున్న ఆరోపణలపై కమలం పార్టీ మండిపడింది. వాద్రాను రక్షిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించింది. ఒప్పందాలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని డిమాండు చేసింది.

బీజేపీ ఎంపీ యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. డబ్బును ఎలా సృష్టించాలో, లాభాలు వచ్చేలా ఏం చేయాలో దేశంలో ఎన్నో బిజినెస్ స్కూళ్లు మనకు నేర్పాయన్నారు. కానీ, ఓ వ్యక్తి పెట్టుబడులు పెట్టకుండా, ఎలాంటి బిజినెస్ స్కూల్ కి వెళ్లకుండా వందల కోట్లు సంపాదించే కళను ఎలా నేర్చుకున్నాడని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆర్ధికమంత్రి చిదంబరం.. వాద్రా నుంచి కొన్ని సలహాలు తీసుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

More Telugu News