మూలకణాలతో సమూలంగా నాశనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూలకణాలతో సమూలంగా నాశనం

పెరుగుతున్న వైద్య పరిజ్ఞానంతో మూలకణాలతో పలు వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. మూలకణాలను ఇప్పుడు క్యాన్సర్‌ వ్యాధిని నివారించేందుకు కూడా ఉపయోగించడం ప్రారంభించారు. మూలకణాలతో క్యాన్సర్‌ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఇలాంటి చికిత్సవల్ల క్యాన్సర్‌ తిరిగి తలెత్తకుండా చేయవచ్చని చెబుతున్నారు.

అమెరికాలోని స్లోవన్‌`కెట్టరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు చెందిన మైఖేల్‌ సెడలెయిన్‌ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో కీమోథెరపీపై పెద్దగా ఆధారపడకుండా ఆ వ్యాధిని ధీటుగా ఎదుర్కొనే మూలకణాల చికిత్సను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ చికిత్స తర్వాత ఈ వ్యాధి తిరిగి తలెత్తకుండా ఉంటుందని కూడా వీరు భరోసా ఇస్తున్నారు. రక్తంలోని తెల్లరక్తకణాలనే మూలకణాలుగా మార్చి వాటితో క్యాన్సర్‌ కణాలపై పోరాడటం అనేది ఈ పరిశోధనలో ఉన్న కీలకాంశం. అంటే ఈ వ్యాధిని ఎదుర్కొనే ఔషధం రోగి శరీరంలోనే ఉంటుందన్నమాట. శరీరంలో క్యాన్సర్‌ కణాలు కొత్తగా కనిపించగానే మూలకణాలు రోగనిరోధక వ్యవస్థ సామర్ధ్యాన్ని ఆసరాగా చేసుకుని వాటిపై దాడిచేసి వాటిని నిర్మూలిస్తాయి. అందుకే దీన్ని సజీవ ఔషధంగా చెబుతున్నామని మైఖేల్‌ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఔషధం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు కూడా ఉండవని చెబుతున్నారు.

More Telugu News