భారత బీడీ, సిగరెట్లు విక్రయిస్తున్న సైట్లపై అమెరికా చర్యలు
భారత్ కు చెందిన బీడీలు, సిగరెట్లు, ఫ్లావర్డ్ బీడీలు, ఫ్లావర్డ్ సిగరెట్లను విక్రయిస్తున్న రెండు వెబ్ సైట్లను అమెరికార ఆహార, ఔషధ మండలి హెచ్చరించింది. వీటి విక్రయానికి అనుమతి లేదని, భారత్ కు చెందిన బీడీలు, సిగరెట్లు కల్తీవని మండలి పేర్కొంది. దేశీ స్మోక్ డాట్ కామ్, వాంట్స్ స్మోక్స్ డాట్ కామ్ అనే ఈ రెండు వెబ్ సైట్లు విక్రయిస్తున్న బీడీలు, సిగరెట్లు కల్తీవిగా పేర్కొంది. వీటివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, తమ అనుమతి లేకుండా విక్రయించడానికి వీల్లేదని ఆదేశించింది.