10 మంది జింక దొంగల అరెస్టు
అనంతపురం జిల్లాలో జింక దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. యల్లనూరు మండలంలో రెండు జింకలను వేటాడిన కేసులో 10 మంది వేటగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై అటవీ చట్టాలను అనుసరించి అటవీ చట్టాల ఉల్లంఘన, నిషేధిత వేట, స్మగ్లింగ్(చర్మం)పై కేసులు నమోదు చేశారు.