ఇదో 'జగన్మోహిని'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇదో 'జగన్మోహిని'

'జగన్మోహిని' సినిమాలో జయమాలిని తన అందంతో హీరోను చంపేందుకు ప్రయత్నిస్తుంది కదా... అలాగే మిస్‌ రివర్టన్‌ అందాల పోటీలో గెలిచిన ఓ ముద్దుగుమ్మ తన అందంతో చుట్టుపక్కల వారిని చంపేయాలనుకుందేమో... వారిపై రసాయనాలతో దాడికి తెగబడింది. చుట్టుపక్కల వారికి ప్రమాదం కలిగే విధంగా ప్రవర్తిస్తోంది. దీంతో పోలీసులు సదరు అమ్మడిని చక్కగా పట్టి జైల్లో పెట్టారు.

ఉటా అందగత్తెల పోటీలో విజేతగా నిలిచిన కెండ్రా మెక్‌ కెన్జీ గిల్‌ అనే అందగత్తెను, ఆమెతోబాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణ ఏమంటే తమ చుట్టుపక్కల ఉన్న వారిపై వీరు కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు నిండివున్న ప్లాస్టిక్‌ సీసాలను విసురుతున్నారు. ఈ ప్రమాదకర సీసాలను విసరడం వల్ల ఎవరూ గాయపడలేదు. కానీ ఇలా ప్రమాదకర పదార్ధాలను ఇళ్లపైన, చుట్టుపక్కల ప్రజలపైనా విసురుతుండడంతో వీరిని అరెస్టు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి పదార్ధాలను కలిగి వుండడం వల్ల అక్కడ కనిష్టంగా ఏడాదినుండి గరిష్టంగా 15 ఏళ్లవరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

More Telugu News