సీఎం, నేను.. సీమాంధ్రుల సమస్యలను లేవనెత్తాం: పీసీసీ చీఫ్ బొత్స
సీమాంధ్ర ప్రజల ఆందోళనలను అధిష్ఠానం ముందు సీఎం, తాను లేవనెత్తామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆంటోనీ కమిటీ ముందు తమ అభిప్రాయాలు ఎవరు వినిపించాలన్న దానిపై సోమవారం సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని బొత్స తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు రాజీనామా డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పలు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని బొత్స తెలిపారు.