'ఏక్ థా టైగర్' ను అధిగమించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఏక్ థా టైగర్' ను అధిగమించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన కామెడీ, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' వసూళ్ల వేటలో దూసుకుపోతుంది. తొలిరోజే రూ.33.12 కోట్లు వసూలు చేసి సల్మాన్ ఖాన్ చిత్రం 'ఏక్ థా టైగర్' రికార్డును వెనక్కినెట్టింది. సల్మాన్ చిత్రం విడుదలైన రోజు రూ.31.25 కోట్లు వసూలుచేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ రికార్డును షారుక్ చిత్రం అధిగమించడం విశేషం. పలు వెబ్ సైట్లు, సినిమా విశ్లేషకులు వెల్లడించిన లెక్కల ప్రకారం.. దీపికా పదుకొనే కథానాయికగా కామెడీ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 9న రంజాన్ సందర్బంగా రిలీజ్ అయింది.

ఈ సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ప్రివ్యూల ద్వారా ఏకంగా రూ.6.75 కోట్లు సాధించి పెట్టింది. ఈ లెక్కన కూడా గతంలో అమీర్ ఖాన్ నటించిన 'త్రి ఇడియట్స్'(రూ.2.7 ప్రివ్యూ కలెక్షన్స్)ను మించిపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు 3,500 స్క్రీన్స్ పై ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం షారుక్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా విజయవంతంగా ఆడుతోందంటున్నారు సినీ పండితులు.

More Telugu News