కిడ్నీ కుంభకోణం సూత్రధారి ఆస్తుల అటాచ్ మెంట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిడ్నీ కుంభకోణం సూత్రధారి ఆస్తుల అటాచ్ మెంట్

కిడ్నీ కుంభకోణం సూత్రధారి డాక్టర్ అమిత్ కుమార్ కు చెందిన 4 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మెల్ బోర్న్ లోని సన్బరీ ప్రాంతంలో ఆయనకు చెందిన ఖరీదైన భవనాన్ని ఎవరూ కొనరాదని, లీజుకు కూడా తీసుకోరాదని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కిడ్నీల కుంభకోణం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలోని ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక కోర్టు గత ఏడాది ఆస్ట్రేలియాకు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడి పోలీసులు చర్యలు తీసుకున్నట్టు ఈడీ వివరించింది. జ్యుడీషియల్ కస్టడీపై ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న డాక్టర్ అమిత్ కుమార్ కు గురువారం ఈడీ ఈ విషయాన్ని తెలిపింది.

More Telugu News