Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిపి మందులు వాడితే క్యాన్సరొస్తుంది?!

ఒక వ్యాధిని తగ్గించుకోవడానికి వాడే మందులు మరో రోగాన్ని తెచ్చే ప్రమాదముందా... అంటే ఉందనే చెబుతున్నారు పరిశోధకులు. బ్లడ్‌ ప్లెషర్‌ను తగ్గించుకోవడానికి మందులు వాడితే వాటి వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మనలో ఎక్కువమందికి బ్లడ్‌ప్లెషర్‌ ఉంటుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి మనవాళ్లు ఎక్కువ మోతాదులో మందులు వాడుతుంటారు. వీటిలో ఫెజర్‌ నార్వేస్క్‌ మందును వాడడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మహిళల్లోనే ఎక్కువగా కనిపించేది బ్రెస్ట్‌ క్యాన్సర్‌. ఈ వ్యాధి మహిళల్లోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలను పరిశోధకులు విశ్లేషించారు. దీనికి కారణం బ్లడ్‌ప్లెషర్‌ను అదుపులో ఉంచడానికి వాడే మందులేనని ఈ విశ్లేషణలో తేలింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను గురించి ఈ పరిశోధనలో పాల్గొన్న లీ మాట్లాడుతూ కాల్షియం చానల్‌ బ్లాకర్స్‌ అయిన ఈ ఫెజర్‌ నార్వేస్క్‌ మందువల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సరు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ మందును పదేళ్లకాలం కన్నా ఎక్కువ కాలం వాడేవారికి ఈ క్యాన్సరు వచ్చే ప్రమాదముందని జామా ఇంటర్నేషనల్‌ మెడిసిన్‌ మేగజైన్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో 1960 మంది రొమ్ము క్యాన్సరు ఉన్న మహిళలను, 891 మందికి రొమ్ము క్యాన్సర్‌ లేని మహిళలను చేర్చారు. వీరు ఎంతకాలంగా బ్లడ్‌ప్లెషర్‌ మందులను వాడుతున్నారో తెలుసుకున్నారు. వీరు ఇచ్చిన వివరాల ప్రకారం పదేళ్లకు మించి కేల్షియం బ్లాకర్స్‌ను వాడుతున్న వారిలో రెండు రెట్లు రొమ్ము క్యాన్సర్‌ వచ్చినట్టుగా పరిశోధకులు గుర్తించారు. అయితే బ్లడ్‌ప్లెషర్‌ను నివారించేందుకు ఉపయోగించే ఇతర వైద్య చికిత్సల వల్ల ఎలాంటి రొమ్ము క్యాన్సరు రాలేదని తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News