శిష్యులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శిష్యులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన వర్మ

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన శిష్యులను అకేషనల్ పార్టీతో ఆనందంలో ముంచెత్తాడు. కుమార్తె రేవతి వివాహం ఈనెల 15న జరగనుండగా, ముందస్తుగా సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులో ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. ముఖ్యంగా ఈ పార్టీలో ఆయన శిష్యులు పూరీ జగన్నాథ్, బ్రహ్మాజీ, మనోజ్ బాజ్ పాయ్ హల్ చల్ చేశారు. ఈ పార్టీకి అటెండ్ అయిన సెలబ్రిటీలను వర్మ కుమార్తె రేవతి తన కాబోయే శ్రీవారు ప్రణవ్ కు పరిచయం చేసిందట. బుధవారం లేట్ నైట్ దాకా సాగిన ఈ పార్టీలో రవితేజ, అల్లు అర్జున్, కోన వెంకట్, సిరాశ్రీ తదితరులు పాల్గొని వర్మ కుమార్తెకు విషెస్ తెలిపారు.

More Telugu News