ఆ జీవో సీమాంధ్రులకు వర్తించదా?: టీఎన్జీవోలు
నాంపల్లిలో టీఎన్జీవో భవన్ లో టీఎన్జీవోలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ లు మాట్లాడుతూ సకల జనుల సమ్మె సమయంలో సచివాలయంలో సమావేశాలు పెట్టకూడదంటూ ఓ జీవో తీసుకొచ్చారని అన్నారు. ఇప్పుడు ఆ జీవో సీమాంధ్రులకు వర్తించదా? అంటూ ప్రశ్నించారు. ఈ నెల 15న హైదరాబాద్ లో సమైక్యాంధ్ర మహాసభ నిర్వహిస్తే, ఆ రోజే శాంతి ర్యాలీ నిర్వహిస్తామని దేవీ ప్రసాద్ ప్రకటించారు.