కాల్చింది పాక్ జవాన్లు కాదట!
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ లో గతరాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించిన ఘటనపై పాకిస్థాన్ స్పందించింది. కాల్పులను 'పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్'(ఐఎస్ పీఆర్)తిరస్కరించింది. తమ సైన్యం వైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగలేదని పాక్ భద్రతాధికారి తెలిపారు.