దుర్గ కేసు నిబంధనలకు లోబడే..: ప్రధాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుర్గ కేసు నిబంధనలకు లోబడే..: ప్రధాని

యూపీలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మసీదు కట్టడాలను కూల్చి, నేతల ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గా నాగ్ పాల్ కేసులో నిబంధనలను అనుసరించే విచారిస్తారని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. పార్లమెంటు వద్ద నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు. దుర్గను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో తెలుపాలని కేంద్రం నిన్న యూపీ సర్కారును కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మన్మోహన్ కు యూపీఏ చైర్ పర్సన్ హోదాలో సోనియా గాంధీ లేఖ రాయడంతో ఈ వ్యవహారంలో కేంద్రం తలదూర్చింది.

More Telugu News