లోక్ సభ వాయిదా.. సమైక్యాంధ్ర ఎఫెక్ట్
సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. అటు టీడీపీ ఎంపీలు, ఇటు కాంగ్రెస్ ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ సభలను హోరెత్తించారు. లోక్ సభలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు పదేపదే వెల్ లోకి దూసుకెళ్ళేందుకు యత్నించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదావేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.