బెంగళూరులో పెరుగుతున్న డేటింగ్ సంస్కృతి
ఐటి రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు నగరంలో యువతీ, యువకుల మధ్య డేటింగ్ కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్, బీపీఓ రంగాలలోని వారే ఈ బాట పడుతున్నారు. అయితే, వీరి సహజీవనం ఎక్కువ కాలం కూడా నిలవడం లేదు. పెళ్లి చేసుకునే ఉద్దేశంతో కాకుండా సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే ధోరణితోనే సహజీవనంవైపు అడుగులు వేస్తున్నారు. ఆన్ లైన్లో పరిచయం, లేదా నేరుగా పరిచయం ఏదో విధంగా సఖ్యత కుదిరితే చాలు.. ఆ యువ జంట తాము భార్య భర్తలమని చెప్పకుంటూ అద్దె ఇంట్లోకి దిగిపోతున్నారు. తీరా ఇంట్లో వాళ్లు పెళ్లి విషయమై ప్రయత్నాలు తీవ్రతరం చేయడం, పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో సహజీవనానికి చెక్ చెప్పి తుర్రుమనడం సాధారణమైపోయింది.
ఇలా సహజీవన పెటాకులకు సంబంధించి 2011-12లో 30 కేసులు నమోదైతే.. గతేడాది ఈ సంఖ్య 42కు చేరినట్లు 'మహిళా సహాయ వాణి' చీఫ్ కోఆర్డినేటర్ రాణి శెట్టి వెల్లడించారు. సిటీ పోలీసులకు అనుబంధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ గా ఈ సంస్థ సేవలందిస్తోంది. 'కొందరు సామాజిక, ఆర్థిక భద్రత కోసం సహజీవనం చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చిన కేసులలో 60 శాతం శృంగారానికి సంబంధించినవే' అని రోహిణి తెలిపారు. ఇలాంటి బంధాలకు చట్టబద్ధత ఉండదని, జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచిస్తున్నారు.