కాకినాడ కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాకినాడ కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం

కాకినాడ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్.. రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు అనుచరుడు అచ్యుతరామయ్యపై దాడి చేశారు. దీంతో, కాకినాడలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నాలుగురోజుల క్రితం గాంధీమోహన్ పట్టణ కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేశారు. ఆ సమయంలో అచ్యుతరామయ్య.. గాంధీమోహన్ తో వాగ్వాదానికి దిగారు. రెండ్రోజుల క్రితమే అచ్యుతరామయ్య పార్టీ ఆఫీసుకు వేసిన తాళాన్ని పగులగొట్టాడు. వీటిపై అదను కోసం కాచుక్కూచున్న రూరల్ ఎమ్మెల్యే.. ఓ సమావేశంలో పాల్గొన్న అచ్యుతరామయ్యపై దాడికి దిగారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా గాంధీ మోహన్.. అచ్యుతరామయ్యపై చేయి చేసుకున్నారు. ఇక ఈ వివాదం పీసీసీ ముందుకు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News