Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత ఎంబసీపై దాడి పట్ల అమెరికా ఖండన

ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ దౌత్య కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడిని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. నిన్న జరిగిన ఈ దాడిలో పదిమంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలున్నారు. అమాయకులను బలిదీసుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి జెన్ సాకి సంతాపం తెలియజేశారు. ఇటీవలే భారత్ ఓ ప్రత్యేక భద్రత బృందాన్ని ఆఫ్ఘన్ పంపింది. ఈ నేపథ్యంలోనే భారత ఎంబసీ లక్ష్యంగా దాడి జరగడం గమనార్హం.

More Telugu News