పరసా రత్నం రాజీనామా
నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట శాసనసభ్యుడు పరసా రత్నం పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పరసా రత్నం నేడు సూళ్ళూరుపేటలో జరిగిన సమైక్యాంధ్ర నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు.