మహిళ సజీవ దహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళ సజీవ దహనం

ఇంటికి నిప్పంటుకుని ఓ వృద్ధ మహిళ సజీవదహనం అయింది. మెదక్ జిల్లా శివంపెట మండలంలోని తిల్లుట్ల గ్రామంలో శకుంతల(75) అనే మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ప్రమాదవశాత్తు వెలుతురు కోసం వెలిగించిన దీపం వల్ల ఇంటికి నిప్పంటుకుని తెల్లవారుజామున ఆమె సజీవదహనమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేసరికే ఆమె మృతి చెందింది. శివంపేట ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News