Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీమాంధ్రులు చేస్తున్నది సబబే: ఎర్రబెల్లి

సీమాంధ్రులు చేస్తున్న ఆందోళనలు సబబేనని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన టీడీపీ నేతలు తెలంగాణకి వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన సవ్యరీతిలో లేదు కనుకే ఉద్యమబాట పట్టారని అన్నారు. రాజధాని, జల పంపిణీ తేలకుండా ఎలా విభజిస్తారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎలా పంపకాలు చేస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు.

More Telugu News