సల్మాన్ ఖాన్ యూకే వీసా రద్దు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ యూకే వీసా రద్దయింది. కొన్ని ప్రత్యేక కారణాలతో వీసా రద్దు కాగా, అందుకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. సాజిద్ నడియడ్ వాలా నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగు కోసం సల్మాన్ లండన్ వెళ్లాల్సి ఉంది. వీసా రద్దుతో ఆయన భారత్ నుంచి వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడింది. కొన్ని రోజుల కిందటే సాజిద్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. గతవారమే ఈ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది.
2002లో మద్యం తాగి కారు నడిపి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన సల్మాన్ పై కేసు నడుస్తోంది. ఈ వ్యవహారమే వీసా రద్దుకు అసలు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత రోజుల్లో వీసా నిబంధనలు చాలా కఠినతరమయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్టులో ఏదైనా కేసు ఉంటే యూకే వీసా సిబ్బంది తిరస్కరిస్తారు. ఇప్పటికే సల్మాన్ కేసులో విచారణ జరిపిన ముంబయి కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. మరోవైపు, వచ్చేవారం సల్మాన్ మళ్లీ తన వీసాకోసం దరఖాస్తు చేయనున్నాడు.