రాష్ట్రాల విభజన దేశాన్ని బలహీనపరుస్తుంది: హజారే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రాల విభజన దేశాన్ని బలహీనపరుస్తుంది: హజారే

రాష్ట్ర విభజనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తనదైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు చేయడం వల్ల కొత్త రాష్ట్రాల డిమాండ్లను ప్రోత్సహించడమే కాకుండా, కొత్త జిల్లాలను కూడా తెరపైకి తెస్తుందన్నారు. దీనివల్ల దేశం బలహీన పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను మొదలుపెట్టడం వల్ల మరికొన్ని డిమాండులు రావడానికి ఆజ్యం పోసినట్లైందని ఉత్తరప్రదేశ్ లోని అజమ్ ఘర్ లో మీడియాతో మాట్లాడిన సమయంలో హజారే హెచ్చరించారు.

More Telugu News