రాయలసీమలో రాజధాని కోసం మా మద్దతు: మంద కృష్ణ
ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెల 21, 22 తేదీలలో 'చలో పార్లమెంట్' ను నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు చేయడం సరికాదని, రాజధాని, ప్యాకేజీ కోసం వారు డిమాండ్ చేయాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటు పడాలని టీఆర్ఎస్ ను కోరారు. రాజధాని కోసం రాయలసీమ వాసులు పోరాడితే తమ మద్దతు ఉంటుందని చెప్పారు.