ఈ మేత వాడితే రొయ్యలు బంగారం కురిపిస్తాయి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ మేత వాడితే రొయ్యలు బంగారం కురిపిస్తాయి

రొయ్యల సాగు గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి. ఒక సీజనులో అయితే మామూలు వ్యవసాయ పొలాలను అన్నిటినీ కూడా రొయ్యల చెరువులుగా మార్చేసి కొందరు లక్షలు గడించేస్తే.. లేటుగా రంగంలోకి ఎంటరైన వారు.. దారుణంగా దెబ్బతినిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు రొయ్యల సాగు ఒక స్థిరీకరణ స్థాయికి చేరుకుంది.

అయితే రొయ్యల సాగులో ఒక విప్లవాత్మక పరిణామానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. వీరు సముద్ర అంతర్భాగంలో దొరికే అతి సూక్ష్మ జీవుల ద్వారా నోవాక్‌ అనే ఒక రకం ఆహారాన్ని రొయ్యల కోసం తయారుచేశారు. ఆ మేత వాడితే రొయ్యలు 30 శాతం వేగంగా, ఆరోగ్యవంతంగా పెరుగుతాయిట.

ప్రస్తుతం రొయ్యలు వేగంగా పెరగడానికి అరుదైన రకాల చేపలను వాడుతుంటారు. వీటి లభ్యత చాల కష్టం కావడం వల్ల.. నిర్వహణ వ్యయం పెరుగుతంది. పైగా.. రొయ్యల్లో రోగాలు, మరణించడాలు అనే ప్రమాదం కూడా ఎక్కువ. ఈ నొవాక్‌తో రొయ్యలు వేగంగా పెరగడంతో పాటూ ఆరోగ్యంగానూ ఉంటాయిట. ఇక మామూలు చేపల మేత అవసరం ఉండదని కామన్వెల్త్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరిస్తున్నారు.

More Telugu News