అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనం

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపురాజు పర్వ గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక మహిళ సజీవదహనమైంది. వంట చేస్తుండగా గ్యాస్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మడివల్లి మంజుల(25) మంటల్లో సజీవ దహనమైంది. ఈ ప్రమాదంలో మూడు గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. విస్సన్నపేట అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

More Telugu News