సౌరాష్ట్ర, విదర్భ, బుందేల్ ఖండ్.. ఇలా చాలా వస్తాయి: అసదుద్దీన్ ఒవైసీ
అసలు సిసలు సమైక్యవాది అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ నిర్ణయంపై మండిపడ్డారు. 'సెటిలర్లు' అనే పదం వాడడం పట్ల నిప్పులు చెరిగారు. ఆంద్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడైనా ఉండచ్చనీ, సీమాంధ్రులు తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వారెందుకు సెటిలర్లవుతారని ప్రశ్నించారు. ఆ పదం ఉపయోగించడం అనాలోచితం, అభ్యంతరకరం అని అన్నారు. అలాగే చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్నదే కేంద్రం అభిప్రాయమైతే బుందేల్ ఖండ్, సౌరాష్ట్ర, విదర్భ వంటి డిమాండ్లు చాలా వస్తాయంటూ, వాటిని కూడా ఇస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడదీస్తే బీజేపీ బలపడుతుందన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని తెలిపారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా రాష్ట్ర విభజన చేసి చూపించాలని అన్నారు.