మొబైల్‌ అంటేపిచ్చా.. క్యాన్సర్‌తో జాగ్రత్త
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొబైల్‌ అంటేపిచ్చా.. క్యాన్సర్‌తో జాగ్రత్త

మొబైల్‌ ఫోను వినియోగం శృతి మించితే.. రకరకాల అనర్థాలు ఆరోగ్యపరంగా తప్పవంటూ ఇప్పటికే అనేక అధ్యయనాలు మనకు చెబుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ క్యాన్సర్‌ అధ్యయన సంస్థ (ఐఏఆర్సీ) ఓ కొత్త బాంబు వేస్తోంది. సెల్‌ఫోన్ల అతి వినియోగం క్యాన్సర్‌ వ్యాధిని కూడా కలిగిస్తుందిట. సెల్‌ఫోన్‌ నుంచి వచ్చే రేడియేషన్‌, విద్యుదయస్కాంత తరంగాలు, లాలాజల గ్రంథులను ప్రభావితం చేస్తాయని ఈ సంస్థ వెల్లడిస్తోంది.

సెల్‌ లను ఎక్కువగా వాడే కొందరిని శాంపిల్‌గా తీసుకుని వారి లాలాజల గ్రంథులను ఈ సంస్థ పరిశీలించింది. తక్కువగా మొబైల్‌ వాడే వారితో పోలిస్తే.. వీరి లాలాజల గ్రంథుల నుంచి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నట్లు గుర్తించారు. వీటి వలన జన్యునిర్మాణం మారవచ్చునని, ఇది అంతిమంగా క్యాన్సర్‌ను కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News