Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధావన్ సూపర్ సెంచరీ

సెన్సేషనల్ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోమారు బ్యాట్ కు పని చెప్పాడు. జింబాబ్వేతో రెండో వన్డేలో బౌలర్లను చితకబాదిన ధావన్ (100 బ్యాటింగ్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది మూడో సెంచరీ. కాగా, 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ ను ధావన్ తన సమయోచిత బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. ధావన్ కు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (64 బ్యాటింగ్) సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 149 పరుగులు జోడించడం విశేషం. దీంతో, భారత్ 40.3 ఓవర్లలో 214 పరుగులు చేసింది.

More Telugu News