మాజీ మంత్రి సరోజినీ పుల్లారెడ్డి మృతి
మాజీ మంత్రి, కాంగ్రెస్
పార్టీ సీనియర్ నాయకురాలు సరోజినీ పుల్లారెడ్డి మరణించారు. ఆమె వయసు 85
సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజినీ హైదరాబాదు,
బోయన్ పల్లిలోని తన నివాసంలో ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. ఎమ్మెల్యేగా,
మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా ఆమె సేవలందించారు.
హైదరాబాదు నగరానికి తొలి మహిళా మేయరుగా కూడా ఆమె వ్యవహరించారు. ఆమె మృతి
పట్ల పలువురు నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.