Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివాదంపై పెదవి విప్పిన చాముండేశ్వరీ నాధ్

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరీ నాధ్ అన్నారు. సచిన్ దగ్గరకు మహిళా క్రీడాకారులు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వెళితే... ఈ సంఘటనని వివాదాలకు వాడుకుంటున్నారని చాముండేశ్వరీ నాధ్ ఆరోపించారు. తాను ఎలాంటి వాడినో సచిన్ కు తెలుసని... సచిన్ ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. 

తనపై బురద జల్లేందుకే గోకరాజు గంగరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేసారని చాముండేశ్వరీ నాధ్ అన్నారు. ఈ వ్యవహరాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన అన్నారు.  ఏసీబీ కేసుతో చిక్కుల్లో ఉన్న గోకరాజు, సచిన్ తో తన సాన్నిహిత్యం చూసి ఈర్ష్యతోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని చాముండీ ఆరోపించారు. 

More Telugu News