జీతంలో కోతకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్

  • జీతంలో కోతకు స్వఛ్చంధంగా ముందుకు వచ్చిన గవర్నర్ బిశ్వ భూషణ్
  • కరోనా కట్టడి చర్యలకు తనవంతు చేయూత
  • రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు అంగీకార లేఖ
కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని పిలుపును అందుకున్న మరుక్షణమే తన జీతంలో సంవత్సరం పాటు ముఫైశాతం కోతకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ఈ మేరకు గవర్నర్ స్వయంగా మంగళవారం రాష్ట్రపతికి అంగీకార లేఖను రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తొంది. ఈ క్రమంలోనే అర్ధిక పరమైన వెసులుబాటు కోసం పలు కార్యక్రమంలు తీసుకుంటుండగా, ప్రధాని మోదీ సోమవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

పార్లమెంటు సభ్యుల నిధుల రద్దు, వారి జీతాలలో కోత వంటి వాటితో పాటు, రాజ్యాంగ అధినేతలుగా ఉన్న రాష్ట్ర పతి, ఉప రాష్ట్ర పతి, గవర్నర్లు స్వచ్చందంగా జీతాల కోతకు ముందుకు వస్తున్నారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ తన జీతం నుండి ప్రతి నెల 30 శాతం నిధులను మినహాయించి కరోనా కట్టడికి వ్యయం చేయాలంటూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖ రాశారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ సామాజిక బాధ్యతలో భాగంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తదనుగుణ ఏర్పాట్లు చేయాలని కోరారు.

More Press News