Pawan Kalyan: రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు మంచి ఫలితాన్నిచ్చాడు: పవన్ తల్లి అంజనా దేవి

Pawan Kalyan Mother Anjana Devi reactos on her son victory in Pithapuram
  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ విక్టరీ
  • తనయుడి విజయం పట్ల అంజనా దేవి హర్షం
  • ఇక రోజూ గాజు గ్లాసులోనే టీ తాగుతానంటూ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో జయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన మాతృమూర్తి అంజనాదేవి స్పందించారు. తనయుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు ఆ దేవుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడని అన్నారు. ఇక ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతాను అంటూ తన కుమారుడి గుర్తు అయిన గాజు గ్లాసును ప్రదర్శించారు. అందులో ఉన్న టీని హాయిగా తాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Pawan Kalyan
Anjana Devi
Pithapuram
Janasena

More Telugu News