జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్
- ఏపీలో వైసీపీ ఓటమి
- సీఎం పదవికి రాజీనామా చేసిన జగన్
- కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలన్న గవర్నర్
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో ఎంతో గొప్పగా గెలిచిన వైసీపీ... 2024 ఎన్నికల్లో పాతాళానికి పడిపోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది.
ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, జనసేన 21 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. వైసీపీ 11 సీట్లతో మూడో స్థానంలో ఉంది. బీజేపీకి 8 స్థానాలు లభించాయి.