Aadudam Andhra: ఆడుదాం ఆంధ్ర పోటీలు పరిశీలనా

ఆడుదాం ఆంధ్ర పోటీలు పరిశీలనా

ఆడుదాం ఆంధ్ర పోటీలు  పరిశీలనా
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉదయం ఇంద్ర గాంధీ మున్సిపల్ స్టేడియం  లో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పురోగతిని పరిశీలించారు. ఆటల పోటీలు సజావుగా నడుస్తున్నాయా లేదా, ఎన్ని మ్యాచులు జరుగుతున్నాయి ఇంకా ఎన్ని మ్యాచ్లు జరగాల్సిన అవసరం ఉంది వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు లేదా అన్న వాటి గురించి పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పోటీలలో ఎటువంటి లోపం లేకుండా నిర్వహించాలని పోటీలు జరిగేటప్పుడు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సక్రమంగా షెడ్యూల్ ప్రకారం ప్రతి మ్యాచ్ నిర్వహించాలని ఎప్పటికప్పుడు నిర్వహించిన మ్యాచ్ల నివేదికను నిరంతరం సమర్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడదామాంధ్ర పోటీలలో కోకో, కబడ్డీ, షటిల్ బాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ పోటీలు సజావుగా నిర్వహించాలని, ఒక పోటీ జరుగుతున్న సమయంలో మరో పోటీ నిర్వహించడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని  అధికారులు,  ఆఫీసర్లు నిరంతరం గ్రౌండ్ లో ఉండి ఆటల పోటీలను పర్యావేక్షిస్తూ ఉండాలని గ్రౌండ్ ఇంచార్జ్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

     
Aadudam Andhra

Watch Today's Deals on Amazon

More Press News