సమర్థవంతమైన & శుభ్రమైన వంట కోసం అల్టిమేట్ కుక్కర్ ట్రై ప్లై స్వచ్ఛ్ హండిని ఆవిష్కరించిన టీటీకే ప్రెస్టీజ్

Related image

నేషనల్, 11 ఆగస్ట్ 2023: మన్నికైన, వినూత్న, బహుముఖ కిచెన్ ఉపకరణాల లెజెండరీ బ్రాండ్  టీటీకే ప్రెస్టీజ్, తన కుక్‌వేర్ కలెక్షన్ కు తాజా జోడింపు ట్రై-ప్లై స్వచ్ఛ్ హండిని పరిచయం చేయడానికి గర్విస్తోంది. ఈ  ప్రభావవంతమైన ట్రై-ప్లై కుక్కర్ తన విలక్షణమైన ఫీచర్లతో వంట అనుభవాలను మార్చడానికి రూపొందించ బడింది.

ప్రతి ఇంటికి శుభ్రమైన, ఆరోగ్యదాయకమైన వంటగదిని ఉంచడం అత్యంత ముఖ్యం. ఈ పనిని సులభతరం చేయడానికి, సులభంగా శుభ్రపరచడానికి వీలు కల్పించే వంటసామాను, ఉపకరణాలను ఎంచుకోవడం చాలా అవసరం. ట్రై-ప్లై స్వచ్ఛ్ హండి అనేది వంటగదిని పరిశుభ్రంగా ఉంచడానికి తమ వంటసామాను శ్రేణికి ఓ విలువ జోడింపు లాంటిది. ఈ వంటసామాను కు గల స్పిల్లేజ్ నియంత్రణ డిజైన్  గందరగోళం లేని వంటకు వీ లు కల్పిస్తుంది. అంతేగాకుండా, వినూత్నమైన లోతైన మూత రూపకల్పన అనేది చిందిపోవడం,  ఒలికిపోవ డంలను ప్రభావవంతంగా నిరోధిస్తుంది. వాటిని వంటగది కౌంటర్‌టాప్, స్టవ్‌టాప్‌పైకి వ్యాపించకుండా నిరోధిస్తుం ది. శుభ్ర పరిచే అవసరాన్ని తగ్గించడం ద్వారా ఇది సమయం, కృషిని ఆదా చేయడమే కాకుండా చక్కనైన,  వ్యవస్థీకృత వంట స్థలాన్ని రూపొందించుకునేలా ప్రోత్సహిస్తుంది.

ట్రై-ప్లై స్వచ్ఛ్ హండి నిర్మాణం దాని మందపాటి గేజ్ అల్యూమినియంతో   అధిక ఉష్ణ పంపిణీ  సమానంగా, పూర్తిగా జరిగేలా చూస్తూ వంట చేయడానికి హామీ ఇస్తుంది. పటిష్టమైన ఆహార-గ్రేడ్‌ స్టెయిన్ లెస్-స్టీల్ లోపలి భాగంతో రూపొందించబడిన ఈ వంటసామాను మన్నికలో శ్రేష్ఠమైనది, ఇది అన్ని రకాల వంటలకు నమ్మక మైన తోడుగా ఉంటుంది. క్లాసిక్ వంటకం అయినా లేదా సాహసాన్ని తలపించే కొత్త వంటకం అయినా, ట్రై-ప్లై స్వచ్ఛ్ హండి ప్రతిసారీ పరిపూర్ణమైన వంటకాన్ని అందిస్తుంది. .

ఒత్తిడి స్థాయిలను నిరంతరం తనిఖీ చేసే  ఇబ్బందిని తొలగిస్తూ, ట్రై-ప్లై స్వచ్ఛ్ హండి అనేది స్పష్టమైన దృశ్య మాన సూచనను అందించే ప్రెజర్ ఇండికేటర్‌ను కలిగి ఉంది. ఎప్పుడు సురక్షితంగా తెరిచేందుకు వీలు ఉంటుం దో అది వినియోగదారులకు తెలియజేస్తుంది.

 
భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, టీటీకే ప్రెస్టీజ్ రూపొందించిన ట్రై-ప్లై స్వచ్ఛ్ హండి అవాంతరాలు లేని వంట అను భవాన్ని అందించేందుకు వినూత్నమైన ఫీచర్లను కలిగి ఉంది. ప్రత్యేకమైన ప్రెషర్ ఇండికేటర్, కంట్రోల్డ్ జీఆర్ ఎస్   (గ్యాస్కెట్ రిలీజ్ సిస్టమ్)తో, ఈ ఉపకరణం మీ వంటగదిలో ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటే వాటిని తొలగిస్తూ, అదనపు ఒత్తిడిని క్రమంగా విడుదల చేస్తుంది. బహుముఖ ప్రజ్ఞ కోసం రూపొందించబడింది. ఇది గ్యాస్, ఇండక్షన్ కుక్‌టాప్‌లు రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులు తాము ఇష్టపడే పద్ధతిని ఉపయోగించి సులభంగా ఉడికించడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా, కూల్ టచ్ వెయిట్ ఫీచర్ హ్యాం డ్లింగ్ సమయంలో సౌలభ్యాన్ని పెంచుతుంది. ప్రెస్టీజ్ హోమ్ కుక్‌లు ఒత్తిడి స్థాయిలను నిరంతరం తనిఖీ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా నిర్ధారిస్తుంది. ట్రై-ప్లై స్వచ్ఛ్ హండిలో ప్రెజర్ ఇండికేటర్ ఉంటుంది. ఇది కుక్కర్ సురక్షితంగా, సకాలంలో తెరవబడుతుందని నిర్ధారిస్తుంది.

ట్రై-ప్లై స్వచ్ఛ్ హండి రెండు పరిమాణాలలో అందుబాటులో ఉంది, 3.0-లీటర్ వేరియంట్ గరిష్ఠ చిల్లర ధర రూ.3,460/- మరియు 5.0-లీటర్ వేరియంట్ గరిష్ఠ చిల్లర ధర రూ. 4,375/-. ఈ కొత్త శ్రేణి భారతదేశం అంతటా ప్రెస్టీజ్ ఎక్స్‌ క్లూజివ్ లొకేషన్స్ లో, ఎంపిక చేసిన డీలర్ అవుట్‌లెట్‌లలో, బ్రాండ్   ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్టోర్ https://shop.ttkprestige.com/ లో లభిస్తుంది. 

 
టిటికె ప్రెస్టీజ్ లిమిటెడ్ అనేది టీటీకే గ్రూప్ లో భాగం. గత ఆరు దశాబ్దాలుగా టిటికె ప్రెస్టీజ్ లిమిటెడ్ భారతదేశ అతిపెద్ద వంటింటి ఉపకరణాల కంపెనీగా ఎదిగింది. గృహిణుల అవసరాలను తీరుస్తోంది. ప్రెస్టీజ్ బ్రాండ్ ప్రతీ ఉత్పాదన కూడా లక్షలాది ఇళ్లలో మొదటి ఎంపికగా ఉంటోంది. ఈ సంస్థ యూకేకు చెందిన హార్వుడ్ హోమ్ వేర్స్ ను కొనుగోలు చేసింది మరియు 2017 ఆగస్టులో భారతదేశంలో జడ్జ్ బ్రాండ్ ను ఆవిష్కరించింది.

More Press Releases