డ్యూరోఫ్లెక్స్ ప్రచారకర్తగా తన మొదటి ప్రచారంలో ప్రమాణం చేసిన గ్రేట్ స్లీప్ హెల్త్ టిప్‌ను పంచుకున్నవిరాట్ కోహ్లీ

Related image

National, 1st August, 2023:  భారతదేశంలోని ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన డ్యూరోఫ్లెక్స్, తన ఎనర్జైజ్ మ్యా ట్రెస్ శ్రేణిని ప్రదర్శిస్తూ, జాతీయ ప్రచారకర్త విరాట్ కోహ్లీతో తన మొదటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాణ్యమైన నిద్రను ప్రోత్సహించడం, దీర్ఘాయువును నిర్ధారించడానికి ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అన్వేషించడాన్ని ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

డ్యూరోఫ్లెక్స్ కోసం విరాట్ కోహ్లీ మొదటి చిత్రం ఆయన వివిధ వ్యక్తుల నుండి అందుకున్న అనేక ఆరోగ్య చిట్కాలను జాబితా చేయడంతో ప్రారంభమవుతుంది. నిమ్మకాయతో వేడి నీళ్లను తాగాలని తన డైట్ కోచ్ చే సిన సూచన మొదలుకొని అమ్మమ్మ చెప్పిన దేశీ నెయ్యి నుంచి వేగంగా నడవాలని తన మామ చెప్పిన      చిట్కాల వరకూ అన్నీ ఇందులో ఉన్నాయి. విరాట్ నిజంగా విశ్వసించే, నిలబడే ఒక ఆరోగ్య చిట్కాను      పంచుకోవడంతో ఇది ముగుస్తుంది, అదేమిటంటే, 8 గంటల గొప్ప నిద్ర. ఈ గొప్ప నిద్రనే గొప్ప ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది.

తన కమ్యూనికేషన్‌లో భాగంగా, విరాట్ కోహ్లి డ్యూరోఫ్లెక్స్ ఎనర్జైజ్ మ్యాట్రెస్ ప్రత్యేక లక్షణాలను హైలైట్ చేశారు. మ్యాట్రెస్ శ్రేణి యొక్క 3-జోన్ ఎన్ఆర్జీ లేయర్, ఎయిర్ గ్రోవ్‌లు స్లీప్ సైకిల్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మీకు 8 గంటల గొప్ప నిద్రను అందించడానికి రూపొందించబడింది.

డ్యూరోఫ్లెక్స్ కు సంబంధించి తన మొదటి ప్రచార కార్యక్రమం గురించి ప్రచారకర్త విరాట్ కోహ్లి మాట్లాడుతూ, "మేం ఆరోగ్యం,  ఫిట్‌నెస్ గురించి మాట్లాడేటప్పుడు, ఇంకా ఏ సంభాషణలు జరగాలి అనే దాని గురించి ముఖ్యమైన విషయం ఒకటుంది. మీరు జిమ్‌లో ఏమి చేస్తారు, మీరు ఎంత బాగా శిక్షణ పొందుతున్నారు అనే దాని గురించి మాత్రమే కాదు; ఇది ఎల్లప్పుడూ ఉండే జీవనశైలి గురించి. జీవనశైలి విషయానికి వస్తే మంచి నిద్ర ప్రధాన అంశం. జిమ్ ట్రైనింగ్ కోసమైనా, మంచి ఆహారం తీసుకోవడానికి సంబంధించి అయినా అవి స్పందించేందుకు  మీ శరీరానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. నిజంగా నేను బాగా నిద్రపోతాను. ఎక్కువ సేపు కూడా నిద్రపోతాను. నేను కోలుకునేందుకు ఈ నిద్ర నాకు సహాయపడుతుంది. శరీర ఆరోగ్యమైనా, మానసిక ఆరోగ్యమైనా బాగుండాలంటే నిద్ర అతి ముఖ్యమైన అంశం’’ అని అన్నారు.

కొత్త ప్రచారం గురించి డ్యూరోఫ్లెక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్‌రాజ్ జగన్నివాసన్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీతో కొత్త బ్రాండ్ ప్రచారం మా ప్రధాన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. విరాట్ ఫిట్‌నెస్‌కు బెంచ్‌మార్క్. చాలా మందికి స్ఫూర్తి. 'గొప్ప నిద్ర గొప్ప ఆరోగ్యానికి దారితీస్తుంది' అనే మా తాత్వికతతో ఆయన చక్కగా మిళితమవుతారు. ఈ సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు వ్యాప్తి చేయడానికి నూతన ప్రచార కార్యక్రమం మాకు వీలు కల్పిస్తుంది. బాగా విశ్రాంతి తీసుకున్న మనస్సు, శరీరం, అత్యుత్తమ పనితీరు మధ్య బలమైన    సంబంధాన్ని ప్రదర్శించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు విరాట్ ను మించిన అసాధారణమైన ఆటగాడు మరెవరు ఉంటారు’’ అని అన్నారు. 

 
విరాట్ కోహ్లీతో డ్యూరోఫ్లెక్స్ కోసం కొత్త యాడ్ ఫిల్మ్ లింక్‌:

Great Sleep Means Great Health | Ft Virat Kohli

 
#GoodSleepGoodHealth డ్యూరోఫ్లెక్స్ నిలకడతో కూడిన సందేశాన్ని నొక్కి చెబుతుంది. ఆధునిక     సాంకేతికతతో, బ్రాండ్ వారి వినియోగదారులకు ప్రత్యేకంగా వ్యక్తిగతీకరించిన నిద్ర పరిష్కారాల ఎంపికలను అందిస్తుంది. డ్యూరోఫ్లెక్స్  ఎనర్జైజ్ మ్యాట్రెస్ స్మార్ట్ స్లీప్ ఎసెన్షియల్‌ల శ్రేణిని పూర్తి చేయడానికి వినూత్నమైన డి-స్ట్రెస్సింగ్ టెక్నాలజీని అందిస్తుంది. కాపర్ జెల్‌తో నింపబడి, యాంటీ-స్ట్రెస్ ఫ్యాబ్రిక్‌ను కలిగి ఉంది, ఎనర్జైజ్ శ్రేణి నిద్ర సాంకేతికత   ల్యాండ్ స్కేప్ ను పునర్నిర్వచిస్తుంది.
 

డ్యూరోఫ్లెక్స్ గురించి

డ్యూరోఫ్లెక్స్ భారతదేశంలోని ప్రముఖ స్లీప్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌లలో ఒకటి. విస్తృత శ్రేణి ప్రీమియం పరుపులు,  నిద్ర ఉపకరణాలను ఇది అందిస్తంది. ఐదు దశాబ్దాలకు పైగా నైపుణ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విప్లవాత్మక బ్రాండ్ నాణ్యమైన నిద్ర అర్థాన్ని పునర్నిర్వచిస్తోంది.

 
డ్యూరోఫ్లెక్స్ వినూత్నమైన, అత్యాధునిక శ్రేణి ఉత్పత్తులతో పరిశ్రమలో అగ్రగామిగా గుర్తింపు పొందింది, ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది. దీని సిగ్నేచర్ శ్రేణి - డ్యూరోపెడిక్ అనేది భారతదేశంలోని డాక్టర్ సిఫార్సు చేయబడిన నం.1 ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ రేంజ్. ఈ బ్రాండ్ నేడు నాణ్యత, వినూత్నత, సౌకర్యానికి పర్యాయ పదంగా ఉంది. దీని ఉత్పత్తి పోర్ట్‌ ఫోలియోకు బలమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు, భవిష్యత్తు అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నాయి.

More Press Releases