Jana Sena: ఈనెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం!
Add ap7am to your home Screen

ఈనెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం!

ఈనెల 30న జనసేన విస్తృత స్థాయి సమావేశం!

జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 30 వ తేదీన నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు,అమరావతి గ్రామాల ప్రజలు - రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు-ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు  ఈ సమావేశంలో పాల్గొంటారు.

Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News